వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని వైఎస్ జగన్ ( YS Jagan )ఎంత పట్టుదలగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఈసారి గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
దానికి తోడు ఈసారి కేవలం గెలుపే కాకుండా 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలంటే టార్గెట్ పెట్టుకున్నారు.దీంతో గెలుపు దిశగా వైఎస్ జగన్ వేస్తున్న ప్రతి అడుగు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది.
ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలను నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నారు.

అయితే ఒకవైపు పార్టీకి మైలేజ్ పెంచుతూనే ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీని( TDP ) ఎదుర్కొనేందుకు సెంటిమెంటల్ గా ముందుకు సాగుతున్నారు.ఒకవైపు వైసీపీ( YCP ) పై పదునైనా వ్యాఖ్యలతో ఆరోపణలతో చంద్రబాబు ( Chandrababu )దూకుడు పెంచుతుంటే.జగన్ మాత్రం టీడీపీని దెబ్బ కొట్టేందుకు ప్రజలనే ఉసిగొల్పుతున్నారు.
ఈ మద్య వైఎస్ ప్రతిబహిరంగ సభలోనూ ప్రజలకే ప్రశ్నలు సంధిస్తూ ఆలోచనలో పడేస్తున్నారు.వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని చంద్రబాబు విమర్శిస్తుంటే.
జగన్ మాత్రం టీడీపీని ఉద్దేశించిఏ ప్రజలకు ఎటు తేల్చుకోవాలనే టాస్క్ లు ఇస్తున్నారు.తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ జరగని సంక్షేమం ఏపీలో( AP ) జరుగుతోందని, అవినీతికి తావు ఇవ్వకుండా పరిపాలన అందిస్తున్నామని చెబుతున్న జగన్.
మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే ఓటు వేయండంటూ ప్రజల సెంటిమెంట్ పై తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న రైతురాజ్యం కావాలా ? లేదా గతంలో మాదిరి రైతులను మోసం చేసిన పాలన కావాలా ? ఆర్బికే వ్యవస్థ కావాలా ? దళారి వ్యవస్థ కావాలా ? మనకు వర్షాలు కావాలా ? లేదా చంద్రబాబు ఐరన్ లెగ్ కరువులు కావాలా ? అంటూ ప్రజలకే ప్రశ్నలు సంధించారు వైఎస్ జగన్.ప్రస్తుతం టీడీపీ విషయంలో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ పార్టీపై తీవ్రమైనా విమర్శలు చేయడం కన్నా గత పాలనకు ప్రసుత్త పాలనకు మద్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తే.ఎవరికి అధికారం కట్టబెట్టాలనేది ప్రజలే నిర్ణయించుకుంటారనే ఉద్దేశంలో వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి వచ్చే ఎన్నికల విషయంలో వైఎస్ జగన్ ప్రజలకే టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.







