చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బ్యానర్ల చిచ్చు రాజుకుంది.అధికార పార్టీ వైసీపీ, విపక్ష పార్టీ టీడీపీ మధ్య బ్యానర్ల వివాదం నెలకొంది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని బెంగళూరు నుంచి కుప్పం వరకు వైసీపీ ఐటీ మరియు సోషల్ మీడియా విభాగం 175 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.జగనన్న ప్రగతి పథం పేరిట వైసీపీ ర్యాలీ కొనసాగింది.
అయితే వైసీపీ శ్రేణులకు స్వాగతం అంటూ టీడీపీ వినూత్న రీతిలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.చంద్రబాబు హయాంలో జరిగిన సమగ్ర అభివృద్ధిని చూడండంటూ ఫొటోలతో పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడమే కాకుండా దగ్ధం చేశారు.దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







