హీరోయిన్ మమతా మోహన్ దాస్ ( Mamatha mohan das )గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఆమె చాలా గ్యాప్ తరువాత తెలుగులో ‘రుద్రంగి( Rudrangi )’ అనే సినిమా చేసింది.
కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా ఆమెకు చాలా మంచి పేరు వుంది ఇక్కడ.కానీ కారణం ఏమిటో గానీ, ఓ రెండు మూడు సినిమాల తరువాత ఆమె తెలుగు ఇండస్ట్రీ లో పెద్దగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు.
అలాగని వేరే భాషలో కూడా సినిమాలు చేసినట్టు సమాచారం లేదు.అవకాశాలు లేకుండా పోయిన పరిస్థితి అయితే ఆమెకి లేదు.
ఎందుకంటే అటు అందంలోగాని, ఇటు నటనలోగాని ఆమెకి ఆమెయే సాటి.

ఇక విషయం ఏదైనా ఇన్నాళ్లకు మరలా ఆమె ఈ సినిమా ద్వారా ఓ మంచి పాత్రలో కనబడడం చాలా సంతోషకరం.ఈ సినిమా ముఖ్య తారాగణం గురించి అందరికీ తెలిసినదే.రుద్రంగి సినిమా మొత్తం జగపతిబాబు పాత్ర చుట్టే తిరుగుతుంది.
కానీ దొర లేదా దేశ్‌ముఖ్ పాత్రను పోషించిన జగపతిబాబు( Jagapathi Babu ) మమతా మోహన్ దాస్ పాత్ర ముందు తేలిపోయాడనే చెప్పుకోవాలి.ఇంకో విషయం ఏమంటే జగపతిబాబు గురించి కాకపోయినా మమతా మోహన్‌దాస్ నటన, ఆ పాత్ర చిత్రణలో వైవిధ్యం గురించైనా ఓసారి ఈ సినిమా చూడొచ్చు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ తన పాత్రలో ఏ స్థాయిలో ఒదిగిపోయిందో చెప్పుకోవచ్చు.

ఇకపోతే దొరసాని సినిమా ఆద్యంతం పాతకాలంలో సినిమాల మాదిరి దొరల అన్యాయాలు, అరాచకాల చుట్టూనే తిరుగుతుంది.అంటే ‘రాములమ్మ‘ సినిమా లెక్క.రాములమ్మ సినిమా దొరసాని కోణంలోనుండి సాగితే ఈ సినిమాలో విశేషం ఏమిటంటే… సినిమా కథ దొర కోణంలోనే సాగుతుంది.కానీ ఈ సినిమాలో చెప్పుకునే విషయం మాత్రం మమతా మోహన్‌దాస్ పాత్ర అని జనాలు చెప్పుకుంటున్నారు.
ఆమె మనందరికీ తెలిసిన నటే.ఇందులో ఆమె ఓ బలమైన, వైవిధ్యమైన పాత్ర లభించింది.ఆమెకు ఇది ఒక్క మాట చెప్పాలంటే మూడో ఇన్నింగ్స్.ఇంత గ్యాప్ తర్వాత కూడా ఆమె ఏమాత్రం తగ్గకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తుంది.ఇకనైనా ఆమె కెరీర్ స్పీడ్ అవ్వాలని కోరుకుందాం.







