ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.
గత ప్రభుత్వ హయంలో అమరావతి( Amaravati )ని రాజధానిగా ప్రకటించగా.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
కానీ ఈ త్రీ క్యాపిటల్స్ అంశం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.దీనికి కారణం అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో త్రీ క్యాపిటల్ అంశాన్ని హోల్డ్ లో ఉంచింది దర్మాసనం.

ఇక అప్పటి నుంచి మూడు రాజధానుల అమలు విషయంలో డైలమాలో పడింది జగన్ సర్కార్.వచ్చే ఎన్నికల లోపు త్రీ క్యాపిటల్స్( Three capitals ) చేసి తీరుతామని చెబుతున్నప్పటికి కోర్టు నుంచి ఇంకా ఎలాంటి పర్మిషన్ రాలేదు.ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి విశాఖపట్నం( ) Visakhapatnamను రాజధానిగా ప్రకటించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తూ వస్తున్నారు.ఈ ఏడాది దసరా నాటికి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయబోతున్నాట్లు గతంలోనే ప్రకటించారు.

తీర ఇప్పుడు దసరా దక్కరకు రావడంతో మళ్ళీ వాయిదా వేస్తూ డిసెంబర్ లో విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని జగన్ తాజాగా ప్రకటన చేశారు.మరి డిసెంబర్ నాటికైనా రాజధాని విషయంలో ఏర్పడ్డ ఈ కన్ఫ్యూజన్ కు జగన్ తెర దించుతారా ? అంటే చెప్పడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.వచ్చే ఏడాది ఏప్రెల్ లేదా మే లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఎన్నికల సమయానికి అమరావతి నుంచి పూర్తిగా రాజధాని మార్పు జరగాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.