ఏపీ బీజేపీ అధ్యక్షుడికి టీడీపీ తో సంబంధాలు ఉన్నాయా ?

ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.

ఒక వర్గం వైసీపీ కి అనుకూలంగా పనిచేస్తుంటే మరో వర్గం వ్యతిరేకంగా విమర్శలు చేస్తుంది అన్న ఆరోపణలు ఎదుర్కుంటోంది.

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను టీడీపీ ఏజెంట్‌గా వైసీపీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు.ఆ పార్టీ అధికార మీడియా, ఆ పార్టీ నేతలు, కన్నాకు టీడీపీతో లింక్ పెట్టి విమర్శలు చేయడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.

కన్నా లక్ష్మినారాయణపై ఆంధ్రప్రదశ్ అధికార పార్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇసుక విధానం, పోలీసుల పాలన వరకూ కన్నా లక్ష్మినారాయణ అన్నిటిని వదిలిపెట్టకుండా వైసీపీ మీద విమర్శలు చేస్తున్నాడు.

  బీజేపీ అగ్ర నాయకుల మాట ఎలా ఉన్నా కన్నా మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.ఈ విషయం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలనే కన్నా కూడా చేస్తున్నారని .ఆయన స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసు దగ్గర్నుంచి వస్తోందా అంటూ వైసీపీ నేతలు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు.రెండు రోజుల క్రితం కన్నా లక్ష్మినారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి, ఏపీ సర్కార్ పై ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇసుక కొరత లేకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారని ప్రభుత్వ నిర్వాకం వల్ల వారంతా ఆకలితో అలమటిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.

  కన్నా లక్ష్మి నారాయణ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే చేస్తున్నారని, ఎదురుదాడి ప్రారంభించారు.వాస్తవానికి కన్నా లక్ష్మినారాయణకు చంద్రబాబు అంటే ఎంత అయిష్టతో ఆయన రాజకీయాలను పరిశీలించేవారికి సులువుగనే అర్థం అవుతుంది.చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడంలో కన్నాఎప్పుడూ ముందు ఉండేవారు.

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు కన్నా సిద్ధమయ్యారు.అమిత్ షా జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు.

ఇప్పుడు బీజేపీ విధానం ప్రకారం వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతూండటంతో కన్నా మీద వైసీపీ ఆగ్రహంగా ఉంది.పదవిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారని సెటైర్లు మొదలుపెట్టారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు