బరువు తగ్గడం కోసం నిత్యం నిమ్మకాయలు తీసుకోవడం మంచిదేనా..?

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఒత్తిడి తదితర అంశాల కారణంగా ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

శరీర బరువు అదుపు తప్పడం వల్ల అనేక జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కాబట్టి బాడీ వెయిట్ ను కంట్రోల్ లో పెట్టుకోవడం చాలా అవసరం.అయితే బరువు తగ్గే క్రమంలో ఎక్కువ శాతం మంది తమ రెగ్యులర్ డైట్ లో లెమన్ ను చేర్చుకుంటారు.

రోజుకు ఒక లెమన్ ను కచ్చితంగా తీసుకుంటారు.అయితే బరువు తగ్గడం( weight loss ) కోసం నిత్యం నిమ్మకాయలు తీసుకోవడం మంచిదేనా అంటే.

కచ్చితంగా మంచిదే.

Advertisement

నిమ్మకాయ( lemon )లో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది.ఇది ఎక్కువ కాలం కడుపును నిండుగా ఉంచే అనుభూతిని కలిగిస్తుంది.అతి ఆకలని అరికడుతుంది.

చిరుతిళ్ళపై కలిగే టెంప్టేషన్స్ ను తగ్గిస్తుంది.అలాగే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది.వేగవంతమైన జీవక్రియ వల్ల శరీరం కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేస్తుంది.

బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు షుగర్ కు కచ్చితంగా దూరంగా ఉండాలి.కానీ ఒక్కోసారి షుగర్ క్రేవింగ్స్ బాగా ఇబ్బంది పెడుతుంటాయి.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?

అయితే రోజుకు ఒక లెమన్ ను తీసుకోవడం వల్ల ఆ క్రేవింగ్స్ కి దూరంగా ఉండవచ్చు.ఎందుకంటే నిమ్మరసం చక్కెర తినాలనే కోరికలను తగ్గిస్తుంది.

Advertisement

అదే సమయంలో రక్తంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది.

సమర్థవంతంగా బరువు తగ్గడానికి ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ( digestive system ) ఎంతో అవసరం.అయితే అందుకు నిమ్మకాయలు తోడ్పడతాయి.లెమన్ జ్యూస్ జీర్ణ రసాలను ప్రేరేపించి జీర్ణక్రియను ఆరోగ్యంగా మారుస్తుంది.

అలాగే లెమన్ లో కేలరీలు తక్కువగా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.అవి మనం మొత్తం ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

అంతేకాకుండా లెమన్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రోజంతా బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి లెమన్ అనేది ఒక ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు