ఏపీలో జిల్లాల పునర్వభజన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.దీనికోసం అన్ని రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
గత వైసిపి( YCP ) ప్రభుత్వం సరైన రీతిలో జిల్లాల విభజన చేపట్టలేదు అని, వాటి కారణంగా ఇప్పటికీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జిల్లాల పునర్విజన చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది .మొత్తం 30 జిల్లాలుగా పునర్వభజన చేయాలని నిర్ణయించింది.దీనికోసం డ్రాఫ్ట్ కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి.గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకపోవడం, కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉండడం, దీని కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో , సీఎం చంద్రబాబు( CM Chandrababu ) జిల్లాల విభజన చేపట్టి తప్పులను సరిచేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు దానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం .
గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలను మార్చినా, ఎప్పటికీ చాలాచోట్ల ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి.దీనికి కారణం అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో, అధికారికంగా జిల్లాల విభజన జరిగినా, అనధికారికంగా ఉమ్మడి జిల్లాలోనే కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయి.దీని కారణంగా ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఈ అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా, సరైన రీతిలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇక అప్పట్లో ఏర్పాటైన జిల్లా పేర్ల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమైనా, ప్రస్తుతం పేర్ల మార్పు విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు.పూర్తిస్థాయిలో 30 జిల్లాలను చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తున్నారట.మరికొద్ది రోజులోనే మొదలు కాబోతున్నట్లు సమాచారం.