అక్కడ మాస్క్ ధరించారో ఫైన్ కట్టాల్సిందే..?!

ఓ రెస్టారెంట్ లో మాస్క్ ధరిస్తే ఫైన్ వేస్తున్నారు.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం.

 Is It Fine To Wear A Mask There Mask , Wear , Latest News , 5 Dollers Fine, Ame-TeluguStop.com

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది.మాస్క్ ధరించకుంటే మన దేశం, మన ప్రాంతంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి.

అయితే, దేశంలో సగం మందికిపైగా టీకాలు వేయడం, కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని అమెరికా వంటి దేశాలు ప్రకటించాయి.అయితే, ఇప్పుడు అదే దేశంలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే నిబంధనను అమలు చేస్తోంది.

మాస్క్ ధరించి వచ్చే వినియోగదారులకు జరిమానా వేస్తోంది.బిల్లుపై అదనంగా 5 డాలర్లు వడ్డిస్తోంది.

అమెరికాలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా కొందరు, భయంతో మరికొందరు మాస్కులు ధరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ ఈ నిబంధన తీసుకొచ్చింది.

చాలామంది వినియోగదారులు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు కానీ మాస్క్‌ తీసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.కాగా, ఇలా జరిమానాల రూపంలో వసూలైన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ తెలిపారు.

అమెరికాలో 45 శాతం మంది టీకా లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ పూర్తైన వేళ రోజువారీ కొవిడ్ మరణాలు 10 నెలల కనిష్ఠానికి దిగి వచ్చాయి.గతేడాది జులై తర్వాత ఇవే అతి తక్కువ రోజువారీ మరణాలు తగ్గాయని అమెరికా ఆరోగ్యశాఖ తెలిపింది.

దాదాపు సగానికిపైగా రాష్ట్రాల్లో మరణాలు సున్నాగా నమోదు కాగా మరికొన్ని రాష్టాల్లో రోజువారీ ఈ సంఖ్య రెండంకెల కంటే దిగువకు వచ్చాయి.వ్యాక్సినేషన్ వల్లే మరణాలు తగ్గుతున్నట్లు జాన్ హోప్‌కిన్స్ విశ్వవిద్యాలయ నిపుణులు కూడా స్పష్టం చేశారు.

అమెరికాలో దాదాపు 45 శాతం మంది పెద్దవాళ్లు రెండు డోసుల టీకా తీసుకున్నారని, 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా పంపిణీ చేశారని తెలిపారు.ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు.

గత వారమే 12 నుంచి 15 ఏళ్ల వారికి కూడా ఫైజర్ టీకా ఇచ్చేందుకు అనుమతి రాగా పాఠశాలలు కూడా తెరిచేందుకు త్వరలో పరిస్థితులు సహకరిస్తాయని అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube