ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లార్డ్స్ మైదానంలో జరగడం అనుమానమేనా..?!

లార్డ్స్ మైదానం.ఇంగ్లాండ్ లోని లండన్ లో ఉన్న లార్డ్స్ మైదానం క్రికెట్ కి పుట్టినిల్లు అని అందరికీ తెలిసిన విషయమే.

మన టీమ్ ఇండియా జట్టుకు ఆ గ్రౌండ్ లో ఎన్నో మరపురాని అనుభూతులు ఉన్నాయి.1983 లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సగర్వంగా వెస్టిండీస్ పై విజయం సాధించి 38 ఏళ్ల క్రితం ప్రపంచ కప్ ను గెలుచుకుంది.ఎన్నో సంవత్సరాల నుంచి భారత క్రికెట్ అభిమానులకు తీరని కోరికగా ఉన్న ప్రపంచకప్ కల జూన్ 25, 1983 న నెరవేరింది.

ఇలా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు లార్డ్స్ మైదానంలో టీమిండియా సభ్యులకు అనేక జ్ఞాపకాలు కొనసాగుతూనే ఉన్నాయి.క్రికెట్ కు కేరాఫ్ అడ్రస్ లార్డ్స్ మైదానం అని ప్రతి ఒక్క క్రికెట్ ఆడుతున్న వ్యక్తి చెప్పగలరు.

దీనికి కారణం ఆ గ్రౌండ్ కు ఏకంగా రెండు వందల ఏళ్ల చరిత్ర ఉండటం.లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్ కి ఎన్నో అపూర్వ విజయాలను అందుకుంది.

అందుకే భారత క్రీడా అభిమానులకు ఆ గ్రౌండ్ ఎంతో ప్రత్యేకమైనది.ఆ గ్రౌండ్ లో ఉన్న లార్డ్స్ మ్యూజియంలో ఎన్నో అరుదైన భారత క్రికెట్ లో ఇప్పటికి చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నాయి.

Advertisement

ప్రతి ఒక్క క్రికెటర్ కచ్చితంగా ఆ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ అయిన ఆడాలని భావిస్తాడు.ఇదివరకు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అలాంటి కల మళ్లీ సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో జరిగింది.

ఇంగ్లాండ్ తో జరిగిన natwest వన్డే సిరీస్ ను గెలిచి భారత సారథి సౌరవ్ గంగూలీ తన ఆనందాన్ని తట్టుకోలేక లార్డ్స్ మైదానంలో తన చొక్కా విప్పి తిప్పి టీమిండియా సత్తా ఏంటో చూపించాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.

షెడ్యూల్ ప్రకటించిన ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో జనవరి 18 నుంచి జనవరి 22 వరకు లండన్ లోని మైదానంలో టీమిండియా ఆడనుంది.అయితే ఇప్పుడు లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగడం పై నీలి నీడలు కమ్ముకున్నట్లు అర్థమవుతోంది.ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న పరిస్థితి అనుగుణంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లో జరగడం పై ఐసీసీ సందిగ్దతలో పడింది.

దీనికి కారణం కూడా కరోనా మహమ్మారి.ఇంగ్లాండులో ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఐసీసీ మరో ప్రత్యామ్నాయ వేదికలను వెతికే ప్రయత్నంలో తలమునకలై ఉంది.దీంతో లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగడం ప్రశ్నార్థకంగా మారింది.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు