ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా పని చేశారు.కానీ ఈయనపై కొన్ని తప్పుడు ఆరోపణలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఆయనన బయటికి పంపేసింది.
ఇక ఈ ఆరోపణ నిజం కాదు అని తెలియజేయడానికి ఆయన పార్టీని వీడి బయటకు వచ్చారు.ఇక బీఆర్ఎస్ ( BRS ) ని ఈటెల వీడే సమయంలో అందరూ కాంగ్రెస్ లోకి వెళ్తారని భావించారు.
కానీ అనూహ్యంగా ఈయన బీజేపీ లోకి వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు.ఇక ఈటెల బీజేపీ కి వెళ్లిన సమయంలో చాలామంది చాలా ఊహగానాలు తెర మీద వైరల్ చేశారు.
ఈటెల రాజేందర్ నిజంగానే భూ అక్రమాణలు చేశారని, అవి బయటపడకుండా ఉండడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి వెళ్తేనే తనకి రక్షణ అని భావించి అందులోకి వెళ్లారని అనుకున్నారు./br>
అయితే బీజేపీ లోకి వెళ్లిన ఈటెల ఆ పార్టీలో అంతగా పొసగడం లేదు.
ఈయనకు బండి సంజయ్ ( Bandi Sanjay ) వర్గీయలకి అంతగా పడడం లేదు.దాంతో ఈటెల రాజేందర్ ఒంటరివాడైపోయాడు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటెల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు వస్తుందని ఆశ పడుతున్నారు.అయితే బిజెపిలో ఇప్పటికే కరీంనగర్ నుండి బండి సంజయ్ మెదక్ నుండి రఘునందన్ రావు వంటి కీలక నేతలు ఉన్నారు.
అయితే ఈటెల రాజేందర్ కి కేవలం కరీంనగర్ అలాగే మెదక్ లోనే ప్రజాదరణ ఉంది./br>
ఇలాంటి సమయంలో బిజెపి ఈయనకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి రెడీగా లేదు.అలాగే ఆయన వేరే చోట పోటీ చేసిన గెలిచే అవకాశం లేదు.దీంతో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ( Karimnagar ) నుండి పోటీ చేస్తారని మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక కరీంనగర్లో ఎంపీ గా పోటీ చేసే బలమైన కాంగ్రెస్ అభ్యర్థి లేరు./br>
పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) గత ఎంపీ ఎలక్షన్స్ లో కరీంనగర్ నుండి పోటీ చేసినప్పటికీ ఆయన ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.దాంతో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వస్తే కరీంనగర్ ఎంపీ సీటు కచ్చితంగా ఇస్తారు.ఈ కారణంతోనే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట.ఒకవేళ ఇదే జరిగితే కచ్చితంగా బండి సంజయ్ కి కరీంనగర్లో షాక్ తప్పదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి చూడాలి ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తారా.లేదా బీజేపీ లోనే ఉంటారా అనేది
.