జాతీయ రాజకీయాల ముఖచిత్రం మారుతోంది.కేంద్రంలో బిజెపికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని, రాబోయేది తమ ప్రభుత్వమే కాంగ్రెస్, తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఆశలు పెట్టుకోగా, ప్రాంతీయ పార్టీల కూటమి తమదే అధికారం అనే ధీమాలో ఉంది.
కేసిఆర్ , మమతా బెనర్జీ వంటి వారు బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే విషయంలో దూకుడుగా ఉన్నారు.అయినా బిజెపి లో మాత్రం ఊపు తగ్గడం లేదు.
మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బిజెపి ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ముఖ్యంగా అతిపెద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బిజెపి మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం తో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం పై చర్చ మొదలైంది.అంతేకాదు, కాబోయే ప్రధాని ఎవరు అనే దానిపైన చర్చలు మొదలయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోది తర్వాత ప్రధాని పీఠం దక్కించుకోబోయేది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనే విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది.ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రసంగిస్తూ ఆకట్టుకోవడంలో యోగి సక్సెస్ అయ్యారు.
అలాగే బిజెపి అగ్ర నేతలతోనూ, ఆర్ఎస్ఎస్ నేతలతోనూ మంచి సన్నిహిత సంబంధాలు యోగి ఆదిత్యనాథ్ కు ఉన్నాయి.అంతేకాదు ఉత్తరప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చడంలోనూ, అక్కడ శాంతిభద్రతలను ఒక గాడిలో పెట్టడంతో పాటు, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో యోగి సక్సెస్ అయ్యారు.
అందుకే మరోసారి ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి పట్టం కట్టారు.ఇదే ఆయనను ప్రధాని పీఠానికి దగ్గర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిరాడంబరమైన జీవితం గడుపుతూ , హిందు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లో యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ అయ్యారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తర్వత ప్రధాని పీఠం పై కూర్చునే అర్హత, అనుభవం అన్ని యోగి మాత్రమే ఉన్నాయి అనేది బీజేపీలోనూ, ఇటు ఆర్ఎస్ఎస్ లో జరుగుతున్న చర్చ.దీనికి తగ్గట్లుగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్ వైపు ఉన్నట్లు సమాచారం.ఇటీవల అమిత్ షా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబోయే ప్రధాని యోగి ఆదిత్యనాథ్ అనే విషయాన్ని ప్రస్తావించారు.
దీన్ని బట్టి చూస్తే, యోగి వైపే అందరి చూపు ఉన్నట్టుగా అర్థమవతోంది.మరో మూడేళ్లలో ఇదే నిజం అవుతుంది అనేది మెజార్టీ బిజెపి నేతల అభిప్రాయం.







