ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది.ఉత్తరాది ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ అదే జోష్‌తో రాజకీయాలు నడిపేందుకు రెఢీ అవుతోంది.
బీజేపీ అధినేతల ఫోకస్ అంతా ఇప్పుడు ఏపీపై పడిందని సమాచారం.ఎలాగైనా ఈసారి ఏపీలో అధికార పీఠం దక్కించుకోవాలని కసితో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో విజయం ఎలా ? అనే అనుమానాలు వ్యక్తమవ్వొచ్చు.అయితే బీజేపీ నేతలు అలాంటి వాటిని ఏవీ పట్టించుకోకుండా ప్రజలుర మార్పు కోరుకుంటే విజయం సాధ్యమవుతుందని కితాబిస్తున్నారు.
ఇందుకు చేయాల్సినదంతా చేయాలని ఏ అవకాశం కూడా వదిలిపెట్టుకోవద్దనే భావనలో ఉందట.ఇదే బీజేపీ ఫిలాసఫీ.దీంతోనే రెండ సీట్లు ఉన్న పార్టీ నేడు దేశంలోనే బలమైన పార్టీగా అవతరించిన విషయం విధితమే.

అయితే ఏపీలో పాగా వేసేందుకు బీజేపీకి ఉన్న ఆయుధం జనసేనాని పవన్‌కళ్యాణ్ అని చెప్పొచ్చు.సినిమాలపరంగా సూపర్‌స్టార్, అంతేకాక రాజకీయాల్లోనూ బలమైన సామాజిక వర్గంకు చెందిన నాయకుడిగా పాపులారిటీ ఉంది.అందుకే అతని ద్వారా ఏపీ రాజకీయాలను బీజేపీ వైపు తిప్పుకోవాలని మాస్తర్ ప్లాన్ వేస్తోందట.
ఇందుకనుగుణంగా యూపీ టు ఏపీ దిశగా బీజేపీ నేతలు పయణిస్తున్నారని టాక్.మరో రెండు రోజుల్లో పవన్‌కు ఫోన్ చేసి సంప్రదింపులు జరపనున్నారట.ఇప్పవరకైతే పవన్‌కు ఎలాంటి అపాయింట్‌మెంట్లు ఇచ్చిన దాఖలాలు లేవు.ఇక లోకల్ లీడర్లతో పవన్ సైతం విసిగిపోయారనే విమర్శలు ఉన్నాయి.
అయితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నుంచే ఎడమొహం.పెడమొహంగా ఉంటూ వచ్చారు.
బద్వేల్ ఉప ఎన్నకిలో మిత్ర పక్షం బీజేపీతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆ గ్యాప్ తొలగిపోనుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది.ఏపీలో పవన్ తోనే రాజకీయాలు నడపాలని ఫోకస్ అంతా పవన్‌పైనే పెట్టాలని యోచిస్తోందట.బీజేపీ పెద్దలు నిర్వహించే బేఠీలోనూ పవన్ ను కార్యోన్ముఖుడిని చేయాలని డిసైడ్ కూడా అయినట్టు తెలిసింది.
ఏకంగా ఏపీలో బీజేపీ, జనసేన కూటమికి పవనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్సు కూడా ఉందట.కాగా ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభకు ముందే ఢిల్లీనుంచి పవన్‌కు పిలుపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మొత్తానికి పవన్ టీడీపీవైపు మళ్లకుండా చూసే పనిలో పడ్డారట.మొత్తంగా ఏపీలో పవన్‌కే అధిక ప్రాధానం ఇచ్చి రాజకీయాలు చేయలనుకోవడం జనసేనకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.మరి బీజేపీ, జనసేన రాజకీయాలు ఏపీలో ఎటు మలుపు తిరుగుతాయో చూడాల్సిందే.







