ఇత‌ను భ‌ర్తేనా.. ఇంత‌లా టార్చ‌ర్ పెడితే ఎలా..?

ఈ మ‌ధ్య మ‌హిళ‌ల మీద జ‌రుగుతున్న దారుణాలు అన్నీ ఇన్ని కావ‌నేచెప్పాలి.

పైగా పైగా బ‌య‌ట జ‌రుగుతున్న‌వి చాల‌వ‌న్న‌ట్టు ఇంట్లో కూడా భ‌ర్త‌లు నానా చిత్ర హింస‌లు పెడుతున్న ఘ‌ట‌న‌లు మనం చూస్తూనే ఉన్నాం.

పెండ్లి అయిన కొత్త నుంచే చాలామంది భ‌ర్త‌లు భార్య‌ల‌ను క‌ట్నం కోస‌మే లేదంటే ఇంకేదైనా ఆనందం కోస‌మో చిత్ర హింస‌లు పెడుతున్నారు.తాజాగా మ‌నం చ‌ద‌వ‌బోయే వార్త కూడా ఇలాంటి దారుణానానికి సంబంధించిందే.

ఇందులో చూస్తే ఓ భర్త త‌న భార్యను పెట్టిన టార్చ‌ర్ గురించి తెలిస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా అని అనిపిస్తుంది.ఈ ఉదంతంలో భర్త పెట్టిన టార్చ‌ర్ నిజంగా కలలో కూడా ఉండ‌దేమో అనిపిస్తుంది.

అత‌ను ఏ విధంగా టార్చ‌ర్ పెట్టాడో తెలిస్తే గ‌న‌క ఇలాంటి వారిని ఏం చేసినా త‌ప్పు లేదు అనిపిస్తుంది.ఇక అత‌ను పెట్టే టార్చ‌ర్ బ‌రించ‌లేని జూబ్లీహిల్స్ లో నివ‌సించే ఆ భార్య చివ‌ర‌కు పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇచ్చింది.

Advertisement

ఎలాగైనా తనన కాపాడాలంటూ వేడుకుంది.తన భర్తపై క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విన్న‌వించింది.

ఆమె చెప్పిన దాంట్లో తాను 2016 లో ప్రేమ పెండ్లి చేసుకున్నాన‌ని, అయితే అప్ప‌టి నుంచి త‌న‌ను భ‌ర్త మాటల్లో చెప్పలేని విధంగా టార్చ‌ర్ పెడుతున్నాడ‌ని చెప్పింది.

పైగా ప్రేమించిన‌ప్పుడు క‌నిపించ‌ని కులం త‌న భ‌ర్త‌కు పెండ్లి అయిన త‌ర్వాత కులం పేరుతో త‌న భ‌ర్త అలాగే అత‌ని సోద‌రి తిడుతున్నారంటూ వాపోయింది.అంతే కాదు గ‌తంలో తాను గర్భం దాల్చగా దాన్ని కూడా బలవంతం గా అబార్షన్ చేయించారంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది.భర్త, అత‌ని సోదరుడు అలాగే వారి సోద‌రి క‌లిసి త‌న‌ను మాన‌సికంగా వేధిస్తున్నార‌ని ప్ర‌తి సారి కులం పేరుతో తిడుతుంటే భ‌రించ‌లేక పోతున్నానంటూ వాపోయింది.

అంతే కాదు నిత్యం అర్థ నగ్నంగా కూర్చోవాలంటూ దాంతో పాటు ప్ర‌తి రోజూ త‌న మూత్రం తాగాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నార‌ని వాపోయింది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు