ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదా..? బ్లాక్ టీ మంచిదా..? అసలు నిజం ఏంటంటే..?

సాధారణంగా చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.అతి ముఖ్యంగా చాలామంది గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి కూడా తాగుతారు.

అయితే ఈ గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.గ్రీన్ టీ ఆయుర్వేద ఆకుల పొడితో తయారుచేస్తారు.

అలాగే బ్లాక్ టీ ఆకుల పొడితో తయారుచేస్తారు.ఇక ఈ వ్యత్యాసం కారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ లో పోషకాల పరిమాణం నాణ్యతలో తేడా ఉంటుంది.

అయితే గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.

Advertisement

అలాగే ఫ్రీ రాడికల్స్ కణాలను కూడా దెబ్బతీస్తాయి.

అంతే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు,( Heart disease ) ఇతర వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అయితే గ్రీన్ టీలో క్యాటెచిన్స్ కూడా ఉంటాయి.అయితే ఇవి బరువు తగ్గడానికి అలాగే మధుమేహాన్ని నియంత్రించడానికి అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఇక బ్లాక్ టీ లో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.కానీ గ్రీన్ టీ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి.ఇక బ్లాక్ టీ కెఫిన్ మొత్తం గ్రీన్ టీ కంటే ఎక్కువగా ఉంటుంది.

కెఫిన్ శక్తి స్థాయిలను పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.అలాగే పోషకాలు కూడా ఉంటాయి.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Advertisement

ఈ విధంగా చూసుకుంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ( Green tea Black tea ) రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.కాబట్టి ఏది మంచిది అనేది వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.అయితే యాంటీ ఆక్సిడెంట్ ( Antioxidant )స్థాయిలను పెంచడం, బరువు తగ్గడం పట్ల ఆసక్తి ఉంటే మాత్రం గ్రీన్ టీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

కెఫిన్ స్థాయిలను పెంచడం, శక్తి స్థాయి లను పెంచడం పట్ల ఆసక్తి ఉంటే బ్లాక్ టీ మంచిది అని చెప్పవచ్చు.ఇలా ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే మీకు ఏ టీ మంచిది అనే దాని గురించి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

తాజా వార్తలు