కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోగా సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనకు తెలిసిందే.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ విజయ్ దేవరకొండకు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ దక్కిందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విజయ్ కథలు ఎంపిక విషయంలో పూర్తిగా తన తండ్రి వర్ధన్ పైనే ఆధారపడతారని సమాచారం.
మొదటగా కథ ఆయన వద్దకు వెళ్లిన తర్వాతే ఆయన ఓకే చెబితేనే విజయ్ దేవరకొండ వద్దకు వెళుతుందని పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంపై వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ విషయంపై విజయ్ దేవరకొండ తండ్రి వర్ధన్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ కథల ఎంపిక విషయంలో నా హస్తం ఉందనీ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదు.కథల ఎంపిక విషయంలో విజయ్ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన సినిమాల విషయంలో తన ప్రమేయం ఏమాత్రం ఉండదు అంటూ ఈ సందర్భంగా వర్ధన్ క్లారిటీ ఇచ్చారు.
విజయ్ సొంతంగా తన కథలను ఎంపిక చేసుకుంటారు అయితే తనకు వీలు కుదిరినప్పుడు ఆ కథ గురించి నాతో చర్చలు జరుపుతారని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తండ్రి తన గురించి వస్తున్న వార్తల పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.







