సాధారణంగా ఏదైనా ఒక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ప్రదర్శన చేసినపుడు లేదా విజయం సాధించినపుడు ఆటగాళ్లు ఆ మ్యాచ్‌కు సంబంధించిన గుర్తుగా బాల్, వికెట్ లేదా బెయిల్స్ వంటి వాటిని తీసుకుంటుంటారు.అయితే ఇటువంటి ఏ కారణం లేకుండా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే అనంతరం అంపైర్ల నుంచి మ్యాచ్ బాల్‌ను ఎంఎస్ ధోని అడిగి తీసుకోవడం సంచలనంగా మారింది.

సరిగ్గా ఇదే విధంగా 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బెయిల్స్‌ను తీసుకున్న ధోని తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇటీవల పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదంటూ విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రెండు ఘటనల మధ్య పోలిక మొదలైంది.ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ త్వరలో వీడ్కోలు చెబుతాడంటూ మీడి యా హల్‌చల్ చేసింది.ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాడేమో అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.







