కాబోయే సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టా...?

నల్లగొండ: రేవంత్ రెడ్డి జర్నలిస్టా.? నాటి జర్నలిస్టు నేడో, రేపో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీడియా సర్కిల్,సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న లేటెస్ట్ చర్చ.

జర్నలిస్టుగా ఉన్న ఆనాటి రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి విస్తృతంగా హల్చల్ చేస్తోంది.

Is Cm Revanth Reddy A Journalist, Cm Revanth Reddy ,journalist, Revanth Reddy, R

అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.మూడు దశాబ్దాల క్రితం రేవంత్ రెడ్డి జాగృతి, వార్త పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశాడని, నాటి నుండే ఫైర్ బ్రాండ్ గా ఉండేవాడని, ఆ ఫైర్ బ్రాండ్ రాజకీయ రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో తానే సైనికుడిలా తయారై సీఎం కాబోతున్నాడని,

Is Cm Revanth Reddy A Journalist, Cm Revanth Reddy ,journalist, Revanth Reddy, R
Is CM Revanth Reddy A Journalist, CM Revanth Reddy ,journalist, Revanth Reddy, R

ఆయన గతంలో జర్నలిస్ట్ గా పనిచేశాడన్న విషయం చాలామందికి తెలియదని కలం కులం ఖుషి అవుతున్నారు.ఓ జర్నలిస్ట్ సీఎం అయితే ఇక జర్నలిస్టుల కష్టాలు కడతెర్చే అవకాశం ఉంటుందని మురిసి పోతున్నారు.మా జర్నలిస్ట్ ముఖ్యమంత్రి కావడం జర్నలిజానికి గర్వకారణమని జిల్లాలో పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?
Advertisement

Latest Nalgonda News