ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎత్తుగడలు కొంచెం గజిబిజిగా ఉన్నట్టే కనిపిస్తాయి.ప్రచారం లో రకరకాలుగా జనాలను ఆకట్టుకుని లబ్దిపొందేందుకు చూస్తుంటాయి.
ఆ విధంగానే ఇప్పుడు వైసీపీ జనల దగ్గర ఓట్ల కోసం కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తోంది.తాము అధికారం లోకి రాకపోతే రాష్ట్రము అధోగతిపాలవుతుంది అని చెబుతూనే ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ జనాలను వేడుకుంటున్నారు.
ప్రస్తుత ఎన్నికలు వైసీపీకి చావో రేవో అన్న పరిస్థితి ఉండడంతో జగన్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగి ప్రచారం మొదలుపెట్టారు.మీ బిడ్డగా భావించి ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ జనాలను అడుగుతుంటే, మా బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల జనాలను వేడుకుంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇటువంటి ప్రచారంపై ప్రస్తుతం జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీ మొత్తం ఫ్యాను గాలి గిరా గిరా తిరుగుతుందని ఒకపక్క ధీమాగా చెప్తూనే మరో పక్క గెలుపుపై ఆశలు వదిలేసుకుని చివరికి సానుభూతి కార్డు వాడేస్తుండడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.మళ్ళీ బాబే రావాలి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది.ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించారని, ఆయన రాకపోతే జరుగుతున్న పనులు, నడుస్తున్న పథకాలు ఆగిపోతాయని ప్రజలను భయపెడుతోంది.
రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, రాష్ట్రానికి పరిశ్రమల రాక వంటివన్నీ కొనసాగాలంటే ఇంకొక్కసారి చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు.ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ బతిమాలాడుకునే పనిలో ఉంది.

ఇప్పటివరకు చంద్రబాబు పాలన చూశారని, జగన్‌కు కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారో చూడొచ్చని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.పిల్లలను పాఠశాలలకు పంపిస్తే నెలనెలా డబ్బులు ఇస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులను ఉచితంగా చదివిస్తామని జగన్ హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు.అయితే వైసీపీ ప్లాన్ చేసిన ఈ సెంటిమెంట్ గేమ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేదే తేలాల్సి ఉంది.