సంతానం ప్రతి దంపతులు కావాలనుకుంటారు , కొందరికి పెళ్ళైన కొన్ని నెలలకే సంతానం కలుగుతుంది , మరికొందరికి కొంచం ఆలస్యంగా కలుగుతుంది.ఈ రోజుల్లో స్త్రీ లు ఒకరిని ఇద్దరిని కనడానికే చాలా అవస్థలు పడుతున్నారు.అలాంటిది ఒకే స్త్రీ ఆమె వయస్సు కంటే ఎక్కువ మందిని కంటే విచిత్రమే కాదా.
తన వయస్సు కంటే ఎక్కువ మంది సంతానం

ఆమె వయసు కేవలం 40 సంవత్సరాలు కానీ ఆమె సంతానం ఆమె వయసు కంటే ఎక్కువ.మరియమ్ నబాటాంజీ అనే ఆమె ఉగాండా వాస్తవ్యురాలు.అక్కడి ముకనో జిల్లాలో ఉండే ఆమెకు 12 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న సంవత్సరం నుండి ప్రతి యేటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో ఇప్పుడు ఆ సంఖ్యను 44 మందికి పెరిగింది.
దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది.ఆమె తన సంతానంలో ఆరు సార్లు కవలలకి జన్మనివ్వగా ,నాలుగుసార్లు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
మరో మూడుసార్లైతే నలుగురు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది.అయితే ఆమె కన్న 44 మంది బిడ్డల్లో కేవలం 38 మంది మాత్రమే బతికున్నారు.

ఆమెకి 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది , అప్పటికే ఆమె భర్త వయసు 28 సంవత్సరాలు.తన చిన్న తనం నుండే పేదరికం లో ఉన్న నబాటాంజి అమ్మ చనిపోవడం తో తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు.తరువాత సవతి తల్లి అక్క చెల్లెళ్లతో పాటు ఆమెని చిత్రహింశాలకు గురిచేదట , అన్నం లో విషం పెట్టడం తో తన అక్క చెల్లాలను కోల్పోయిన నబాటాంజి తరువాత బలవంతంగా ఆమెకి ఇష్టం లేని పెళ్లిచేయడం తో అతను ఆమెని సెక్స్ కి బానిస గా మార్చాడు.

తను 18 మంది పిల్లలను కన్నాక ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని కానీ విపత్కర పరిస్థితుల వల్ల కుదరలేదని తెలిపింది.అయితే డాక్టర్లు మరియమ్ గురించి మాట్లాడుతూ ఒక జన్యు పరమైన సమస్య వల్లే ఆమె ఒకే కాన్పులో ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలను కనడం జరుగుతోందని తెలిపారు.2016లో చివరిసారిగా ఆమెకు ఆపరేషన్ చేయడంతో ఆమె మళ్లీ తల్లి అయ్యే అవకాశం కలగలేదు.ఇప్పుడు ఆమె గురించి వార్తలు బయటకి రావడం తో ఉగాండా లో పలు చోట్ల ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు….







