ఐపీల్ 23: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌... ఫ్రీగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జెర్సీని పొందండిలా!

క్రికెట్‌ అభిమానులందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ 2023 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే మిగిలి వున్నాయి.అవును, ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్న సూపర్ క్రికెట్‌ లీగ్‌ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి.

 Ipl 2023 Buy Two Tickets Get A Free Sunrisers Hyderabad Jersey Details, Ipl 23,-TeluguStop.com

ఈ క్రమంలో సో కాల్డ్ జట్టు ఆటగాళ్లందరూ ఒక చోటుకు చేరి ప్రాక్టీస్‌ ముమ్మురంగా చేస్తున్నారు.ఇక ఐపీఎల్‌ ( IPL ) మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు కూడా మొదలైన విషయం తెలిసినదే.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సమరం కోసం ఆసక్తితో ఎదురుచూస్తోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌( Sunrisers Hyderabad ) మేనేజ్‌మెంట్ ఒక శుభవార్త చెప్పడం విశేషం.

Telugu Buy Tickets, Fans, Ipl, Ipl Srh, Ups, Uppal Stadium-Sports News క్ర

విషయం ఏమంటే, రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫ్రీగా జెర్సీలు( SRH Jersey ) పంచేందుకు సర్వత్రా సిద్ధమైంది.ఇలా పంచడం ద్వారా తమ టీమ్‌కు మరింత సపోర్ట్‌ పెంచవచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.ఇక అభిమానులు కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జెర్సీలు కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు వున్నాయండోయ్.ఇందులో భాగంగా 2 ఐపీఎల్‌ టికెట్లను బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్‌ జెర్సీలను అందించనున్నారు.

Telugu Buy Tickets, Fans, Ipl, Ipl Srh, Ups, Uppal Stadium-Sports News క్ర

కాబట్టి అభిమానులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.ఇంకా ఆలస్యం దేనికండి… మీకు కూడా సన్‌రైజర్స్‌ జెర్సీ కావాలంటే వెంటనే 1 కాదు 2 ఐపీఎల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోండి.టికెట్లపై 25 శాతం డిస్కౌంట్‌.లభించడంతో పాటు మీకు జెర్సీలు లభించనున్నాయి.ఈ సీజన్‌ సన్‌రైజర్స్‌ హోం మ్యాచ్‌లు ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీపడనుండి.

ఈ మ్యాచ్ల టికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.కావలసినవారు పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మొదటి 10 వేల టికెట్స్ను బుక్ చేసుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube