నువ్వు నిద్రలేని రాత్రులు గడపొద్దు... అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్!

నందమూరి తారకరత్న గత నెల 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా తారకరత్న (Tarakaratna) మరణించడంతో తన భార్య అలేఖ్య రెడ్డి ఎంతో కుమిలిపోతున్నారు.

 Don't Spend Sleepless Nights... Alekya Reddys Post Is Viral ,alekya Reddy,tarakr-TeluguStop.com

ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నను తలుచుకుంటూ తరచు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ వచ్చారు.తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే వీరి ప్రేమ పెళ్లిని ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో ఈయన కొద్ది రోజులపాటు తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు.

ఇలా ఇంటికి దూరంగా ఉన్నటువంటి తారకరత్నను బాలకృష్ణ (Balakrishna) చివరికి తన కుటుంబంతో కలిపినప్పటికీ తారకరత్నకు తన తల్లిదండ్రులతో పెద్దగా మాటలు లేవని తెలుస్తుంది.చివరికి తారకరత్న మరణం విషయంలో కూడా తన తల్లిదండ్రులు కాస్త కఠినంగానే వ్యవహరించారని తెలుస్తోంది.కుటుంబం తనని దూరం పెట్టిన బాలకృష్ణ తన కుటుంబానికి అండగా ఉన్నారంటూ అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) సోషల్ మీడియా వేదికగా తన కుటుంబానికి బాలయ్య ఎలాంటి సహాయం చేస్తున్నారో తెలియచేశారు.

ఇక తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ (Instagram) స్టోరీస్ ద్వారా భగవద్గీత సారాంశాన్ని షేర్ చేశారు.ఇందులో భాగంగా… ప్రతి ఒక్కరికి మన మీద ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉండదు.జీవితం ఎలా ఉంది.ఏం జరిగింది? అనే విషయం నీకు మాత్రమే తెలుస్తుంది.ఎదుటి వాళ్లకు నీ గురించి ఏం తెలియదు.వారి కోసం ఆలోచిస్తూ నువ్ నిద్రలేని రాత్రులు గడపొద్దు అంటూ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.తారకరత్న లోకేష్ ప్రారంభించిన యువగలం( Yuvagalam) పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా స్పృహ తప్పి గుండెపోటుకు గురయ్యారు.

దీంతో 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube