ఐపీల్ 23: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌… ఫ్రీగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జెర్సీని పొందండిలా!

క్రికెట్‌ అభిమానులందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ 2023 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే మిగిలి వున్నాయి.

అవును, ఈ నెల 31 నుంచి ప్రారంభం కాబోతున్న సూపర్ క్రికెట్‌ లీగ్‌ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి.

ఈ క్రమంలో సో కాల్డ్ జట్టు ఆటగాళ్లందరూ ఒక చోటుకు చేరి ప్రాక్టీస్‌ ముమ్మురంగా చేస్తున్నారు.

ఇక ఐపీఎల్‌ ( IPL ) మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు కూడా మొదలైన విషయం తెలిసినదే.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సమరం కోసం ఆసక్తితో ఎదురుచూస్తోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌( Sunrisers Hyderabad ) మేనేజ్‌మెంట్ ఒక శుభవార్త చెప్పడం విశేషం.

"""/" / విషయం ఏమంటే, రానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫ్రీగా జెర్సీలు( SRH Jersey ) పంచేందుకు సర్వత్రా సిద్ధమైంది.

ఇలా పంచడం ద్వారా తమ టీమ్‌కు మరింత సపోర్ట్‌ పెంచవచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ఇక అభిమానులు కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జెర్సీలు కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు వున్నాయండోయ్.

ఇందులో భాగంగా 2 ఐపీఎల్‌ టికెట్లను బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్‌ జెర్సీలను అందించనున్నారు.

"""/" / కాబట్టి అభిమానులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.ఇంకా ఆలస్యం దేనికండి.

మీకు కూడా సన్‌రైజర్స్‌ జెర్సీ కావాలంటే వెంటనే 1 కాదు 2 ఐపీఎల్‌ టిక్కెట్లను బుక్‌ చేసుకోండి.

టికెట్లపై 25 శాతం డిస్కౌంట్‌.లభించడంతో పాటు మీకు జెర్సీలు లభించనున్నాయి.

ఈ సీజన్‌ సన్‌రైజర్స్‌ హోం మ్యాచ్‌లు ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.

ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీపడనుండి.

ఈ మ్యాచ్ల టికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.కావలసినవారు పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

మొదటి 10 వేల టికెట్స్ను బుక్ చేసుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది.

వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూతురి ఫోటో చూశారా.. ఇంత పెద్ద కూతురా అంటూ?