సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ( Balakrishna )కుమార్తె నందమూరి, నారా బ్రాహ్మణి( Brahmani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నందమూరి ఇంటి ఆడబిడ్డగా నారావారి కోడలిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
అయితే సినీ రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఈమె ఈ రంగాలలోకి రాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి బిజినెస్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ సాధిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఇక బ్రాహ్మిని రాజకీయాలలోకి కానీ సినిమాల విషయాలలోకి కానీ తల దూర్చాడు.
ఎక్కడికి వెళ్లినా చాలా డిగ్నిటీగా తన పని తాను పూర్తి చేసుకుని నారా నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు.

ఇలా బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నారా బ్రాహ్మణికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా బర్త్ డే పార్టీ ( Birthday Party )అంటే ప్రతి ఒక్కరూ పార్టీలు చేసుకోవడం పబ్బులకు వెళ్లడం జరుగుతుంది.ఇలా పుట్టిన రోజు జరుపుకోవడానికి లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటారు.
అయితే బ్రాహ్మణి మాత్రం అందుకు చాలా విరుద్ధం అని చెప్పాలి.ఈమె కాలేజీలో చదువుతున్న సమయంలోనే తన వద్ద ఉన్నటువంటి డబ్బును పార్టీల కోసం ఉపయోగించకుండా తన వద్ద ఉన్న డబ్బుతో తన తండ్రి పుట్టిన రోజు కనుక వస్తే పేదవారికి సహాయం చేసే వారట.

అయితే ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా మంచి సక్సెస్ సాధించిన బ్రాహ్మణి తన తండ్రి పుట్టిన రోజు కనుక వస్తే దాదాపు వెయ్యి మంది అనాధ పిల్లలకు భోజనాలు పెట్టించడమే కాకుండా వారికి దుస్తులు కూడా అందజేస్తారట.ఇలా ఇప్పటికీ బ్రాహ్మణి తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి గొప్ప పని చేస్తారనే వార్త వైరల్ గా మారడంతో మరోసారి బ్రాహ్మణి మంచి మనసు పై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక బాలకృష్ణ సినిమా రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ తన కూతుర్లను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.తన ఇద్దరు కుమార్తెలు బిజినెస్ రంగంలో స్థిరపడి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు.