కళాకారులు, సెలబ్రెటీలను ప్రాంతాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు.టాలెంట్‌కు భాష, ప్రాంతం అనే తేడా ఉండదు.
అలాగే సెలబ్రెటీలకు కూడా ప్రాంతం, భాష అనే తేడా ఉండదు.తమలోని ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇక సింగర్లకు( Singers ) కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు.అయితే తాజాగా ఒక పాక్ సింగర్( Pakistan Singer ) నెటిజన్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తుపాకీతో గాన ప్రదర్శన చేస్తున్న చేస్తున్న ఒక గాయకుడి వీడియోను సోషల్ మీడియా షేర్ చేసి సవాల్ చేశారు.
పాకిస్తాన్ గాయకుడు అలీ జాఫర్( Singer Ali Zafar ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు షాకింగ్ కు గురి చేస్తోంది.ఒక ఫంక్షన్ లో ఒక గాయకుడు పాట పాడుతూ తుపాకీతో కాల్పులు జరుపుతున్నాడు.కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన సింగర్ అలీ జాఫర్.
ఈ సందర్భంగా నెటిజన్లకు సవాల్ చేశారు.దమ్ముంటే ఈయనకు వీడియోను ట్యాగ్ చేసి విమర్శలు చేయండంటూ ఛాలెంజ్ విసిరారు.
అయితే తుపాకీతో గాన ప్రదర్శన చేస్తున్న వ్యక్తి కూడా పాకిస్తాన్ వ్యక్తేనని తెలుస్తోంది.
ఈ వీడియోలో అతడు పాట పాడుతూ తుపాకీని లోడ్ చేయడం, గాల్లోకి కాల్పులు జరపడం చూడవచ్చు.అయితే అతడి చేతిలో ఉన్నది నిజమైన తుపాకీనా లేదా క్రాకర్స్ కాల్చే తుపాకీనా అనేది తెలియడం లేదు.కానీ ఇతడి తీరును చూసినవారు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఎవరైనా మరణాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈయన గానం పట్ల అభ్యంతరం చెప్పాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇక మరో నెటిజన్ .ఇతడు ఉత్తమ గాయకుడు అంటూ కామెంట్లో పేర్కొన్నాడు.ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.