కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్న అంతర్జాతీయ మల్లయోధుడు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంత సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే.

కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

ఇక ఈ సినిమా కథ, కథనంతో ప్రపంచ స్థాయిలో కేజీఎఫ్ సినిమా రీసౌండ్ వినిపించింది.ఈ సినిమాతో ఒక్కసారిగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు.

స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.ఇప్పుడు ఈ కాంబినేషన్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కింది.

మొదటి సినిమా కంటే మరింత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది.

Advertisement

జులై 16న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం జరిగిపోయింది.

రిలీజ్ కి ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పడానికి తాజాగా అంతర్జాతీయ మల్లయోధుడు రెజ్లర్ విల్లీ మాక్ కామెంట్స్ చేశాడు.

కేజీఎఫ్ చాప్టర్ 1 వీక్షించిన అతను సినిమాపై ప్రశంసలు కురిపించారు.విల్లీ మాక్ తన ట్విట్టర్ వాల్ పై కెజిఎఫ్ చాప్టర్ 1 అంటే ఎనలేని ప్రేమ అని, కెజిఎఫ్ 2 వచ్చే వరకూ వేచి చూడలేనని వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ టీజర్ నుండి జిఫ్ వీడియోని కూడా అతను షేర్ చేశాడు.అతని కామెంట్స్ ద్వారా ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు