పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన ఆది పురుష్ (Adipurush) సినిమా జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించిన సీత పాత్రలో కృతి సనన్(Kriti Sanon) నటించారు.విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Rauth) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు.అలాగే సినిమా నుంచి విడుదలైన టీజర్ సైతం సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్(Pre Release Event) వేడుకలను నిర్వహించడానికి మేకర్ సిద్ధమయ్యారు.
ఈ వేడుకను తిరుపతిలో జూన్ 6వ తేదీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.అయితే ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ వేడుక జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుతూ చరిత్ర సృష్టించబోతున్నారని తెలుస్తోంది.

ఈ ప్రీరిలీజ్ వేడుకకు దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారట అంతే కాకుండా 200 మంది సింగర్స్ 200 మంది డాన్సర్ చేత కార్యక్రమాలను చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే ఈ వేడుక కోసం ప్రత్యేకంగా క్రాకర్స్ తయారు చేయిస్తున్నారని వీటిని పేల్చిన సమయంలో జైశ్రీరామ్ (Jai Sriram) అనే శబ్దం వచ్చేలా వీటిని తయారు చేస్తున్నారని తెలుస్తుంది.ఇలా ఏ సినిమా వేడుక జరగని విధంగా ఆది పురుష వేడుకను నిర్వహించడానికి మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఎప్పటికీ అందరికీ గుర్తుండి పోయేలా చేయాలని మేకర్స్ భావించారట.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.