తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో( Jabardast Comedy Show ) గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీ పరిచయమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే.
అటువంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకరు.జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతోపాటు కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు కార్తీక్( Karthik ).జబర్దస్త్ షో ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించుకున్న కార్తిక్ ఆస్తులపరంగా కూడా బాగానే మూట కట్టుకున్నాడు అని చెప్పవచ్చు.
మంచి మంచి చదువులు చదివినప్పటికీ సినిమాలపై ఉన్న ఇష్టంతో మొదట మిమిక్రీ ఆర్టిస్ట్( mimicry artist ) గా కెరియర్ను మొదలుపెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని జబర్దస్త్ లో కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు కార్తీక్.జబర్దస్త్ లో కార్తీక్, అవినాష్ లు కలిసి ఒక టీమ్ గా చేయగా ఆ తర్వాత అవినాష్ కూడా వెళ్లిపోవడంతో కార్తీక్ టీం లీడర్ అయ్యాడు.ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీక్ సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే త్వరలోనే కార్తీక్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.ఇదే విషయాన్ని స్వయంగా కార్తీక్ చెప్పుకొచ్చాడు.
తన కాబోయే భార్యతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీక్.అయితే ఫోటోలు అయితే రివీల్ చేశాడు కానీ ఆమె ముఖం కనిపించకుండా తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు.మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే.లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొందరు అంటుంటారు.అది ఇదే కావచ్చు.నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్( Thank you beautiful ).నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఎదురుచూస్తున్నాను అంటూ రెండు ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు అభిమానులు నెట్టిజన్స్,కూడా కార్తిక్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.