సినీ చరిత్రలోనే తొలిసారిగా చరిత్ర సృష్టించబోతున్న ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్!
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన ఆది పురుష్ (Adipurush) సినిమా జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించిన సీత పాత్రలో కృతి సనన్(Kriti Sanon) నటించారు.
విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Rauth) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
"""/" /
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు.
అలాగే సినిమా నుంచి విడుదలైన టీజర్ సైతం సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్(Pre Release Event) వేడుకలను నిర్వహించడానికి మేకర్ సిద్ధమయ్యారు.
ఈ వేడుకను తిరుపతిలో జూన్ 6వ తేదీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
అయితే ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ వేడుక జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుతూ చరిత్ర సృష్టించబోతున్నారని తెలుస్తోంది.
"""/" /
ఈ ప్రీరిలీజ్ వేడుకకు దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారట అంతే కాకుండా 200 మంది సింగర్స్ 200 మంది డాన్సర్ చేత కార్యక్రమాలను చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే ఈ వేడుక కోసం ప్రత్యేకంగా క్రాకర్స్ తయారు చేయిస్తున్నారని వీటిని పేల్చిన సమయంలో జైశ్రీరామ్ (Jai Sriram) అనే శబ్దం వచ్చేలా వీటిని తయారు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇలా ఏ సినిమా వేడుక జరగని విధంగా ఆది పురుష వేడుకను నిర్వహించడానికి మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఎప్పటికీ అందరికీ గుర్తుండి పోయేలా చేయాలని మేకర్స్ భావించారట.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
షారూక్ ఖాన్ ఇంటి అద్దె ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా అన్ని లక్షలా?