ఎవరు మీలో కోటీశ్వరులు లో ఎన్టీఆర్ తో రామ్ చరణ్ చెప్పిన ఆసక్తికర సంగతులు..

ఎన్టీఆర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానం ఎలా ఉంటుంది.వీరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది.

 Interesting Things That Ram Charan Said With Ntr Among  Evaru Melo Koteeswarulu,-TeluguStop.com

  వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలా ఉంటుందో తెలియాలంటే ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం మీరు చూడాల్సిందే.ఎన్టీఆర్ హోస్ట్ గా , ఈ షోకు రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్  సమాధానం ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.‘జానీ’ సినిమాలో ఓ సాంగ్ పాడింది ఎవరు.? అని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ తన బాబాయ్ అని జవాబిచ్చాడు.ఆ సందర్భంగా తన బాబాయ్ తో అనుబంధాన్ని పంచుకున్నాడు.

జీవితంలో కొన్ని బంధాలు గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది తక్కువే అవుతుంది.అనుబంధం బయట పెట్టకపోవడమే మంచిది మా అనుబంధం బయటపెడితే దిష్టి తగులుతుందేమో.

అలాంటి అనుబంధమే నాకు కళ్యాణ్ బాబాయ్ కి మధ్య ఉందని రామ్ చరణ్ తెలిపారు.మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేను బయట ఎక్కువగా మాట్లాడను నా చిన్నప్పటి నుంచి ఆయనతో ఉన్న రిలేషన్ మాటల్లో చెప్పలేనిది.

నాన్న షూటింగుల్లో బిజీగా ఉంటే అమ్మ కూడా నాన్నతో పాటు లొకేషన్ కి వెళ్ళేది.దాంతో మా బాబాయ్ మా ముగ్గురికి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే వారు.

ట్యూషన్ లో సరిగ్గా చదవక పోతే మమ్మల్ని మందలించేవారు నేను  నాన్నతో డైరెక్టర్ గా చెప్పలేను కొన్ని కొన్ని విషయాలు బాబాయ్  నాన్నకు చెప్పేవారు. ఆయన నాకు సోదరుడు, ఫ్రెండ్, బాబాయ్, చిన్న తండ్రి అంటూ పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంతో వివరించారు.

తనకు కుక్కలు అంటే ఇష్టం అని.తన దగ్గర ప్రస్తుతం ఆరు కుక్కలు ఉన్నాయని వాటితోపాటు గుర్రాలు కూడా పెంచుకోవడం కూడా ఇష్టమని చెప్పారు.తన దగ్గరున్నగుర్రాలలో ఒకదాని పేరు ‘బాద్ షా‘, ఇంకో దాని పేరు ‘కాజల్’ అని చెప్పుకొచ్చారు.ఓ గుర్రాన్ని తన మిత్రుడు చనిపోయే ముందు తనకు గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పాడు.

కొమురంభీం పాత్రలో స్క్రీన్ పై ఎన్టీఆర్ ను చూసి మీరందరూ ఫిదా అయిపోతారాని ఆ మ్యాజిక్ నేను ఇప్పుడే చెప్పను త్వరలో తప్పకుండా మీ అందరూ వెండితెరపై చూస్తారని అంటూ ఎన్టీఆర్ పాత్ర పై ఆసక్తి రెట్టింపు చేశారు రామ్ చరణ్.కొమురంభీం పాత్రలో నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆ సినిమా షూటింగులో మనం ఎంతో కష్టపడ్డాం అల్లూరి సీతారామరాజుగా  నువ్వు, కొమురంభీం పాత్రలో నేను ఎంత కష్టపడ్డారో తెలుసుగా అలాంటి గొప్ప పాత్రల్లో నటించడం అంటే నిజంగా మన పూర్వజన్మసుకృతం అంటూ ఆర్ఆర్ఆర్ విశేషాలను ఎన్టీఆర్ పంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube