అమెరికాలో హృదయ విదారక ఘటన..వ్యాక్సినేషన్ తీసుకోండి అంటూ ఓ తల్లి ఆవేదన..!!

అగ్ర రాజ్యం అమెరికాలో డెల్టా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో అమెరికన్స్ మృతి చెందుతున్నారు.

 American Mother Lost Her Sons Covid Effect , America, Corona , Vaccination, Lis-TeluguStop.com

ఒక పక్క ఆసుపత్రులలో బెడ్స్ ఖాళీలు లేక, సరైన సమయంలో వైద్య సాయం అందక ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన అధ్యక్షుడు బిడెన్ వ్యాక్సినేషన్ వేసుకోవాలంటూ ప్రజలకు ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్న మెజారిటీ ప్రజలు మాత్రం బిడెన్ సూచనలను పట్టించుకోలేదు ఫలితంగా నేడు అమెరికాలో లెక్కకు మించిన కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికాలో ఓ కుటుంభంలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది.ఫ్లోరిడా కు చెందిన లీసా బ్రాండన్ అనే మహిళకు ఆరోన్, ఫ్రీ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

గత నెల జులై లో తల్లీ కొడుకులు ముగ్గురూ మహమ్మారి బారిన పడ్డారు.వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా తల్లి మహమ్మారి నుంచీ బయటపడి ఆరోగ్యంగా ఉంది.

అయితే పిల్లలు ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఆగస్టు 12 వ తేదీన ఒక కుమారుడు మృతి చెందారు.గంటల వ్యవధిలో మరొక కుమారుడు ఆగస్టు 13 న మృతి చెందటంతో ఆ తల్లి తట్టుకోలేక పోయింది.

తాను ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నాను, ఇలా ఎవరికీ జరగకూడదు అందుకే అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అంటూ బోరున విలపించింది.

గతంలో లీసా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు.

అయితే తన కుమారులు వ్యాక్సినేషన్ విషయంలో అశ్రద్ద చేశారని, వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్పినా ఇద్దరూ పట్టించుకోలేదని, తాను వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగానే ప్రస్తుతం కరోనాను తట్టుకుని బ్రతికానని, వారు తీసుకోలేదు కాబట్టి మృతి చెందారని ఇలా ఏ కుటుంభంలో జరగకూడదు వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరూ తీసుకోమని సూచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube