'సలార్' సినిమాలో క్లైమాక్స్ హైలెట్ అట !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమాపై ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఆయన చేసిన కెజిఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటించబోతుంది.

ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతాడో అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించ బోతున్నాడని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.అయితే ప్రభాస్ డ్యూయెల్ రోల్ అని క్లైమాక్స్ లో రివీల్ అవుతుందట.

ఈ సినిమాలో క్లైమాక్స్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పుకుంటున్నారు.రెండు విభిన్న పాత్రలలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సలార్ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ నిలిపి వేశారు.త్వరలోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ప్రభాస్ కూడా ఈ సినిమాను ఈ సంవత్సరమే పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట.అందుకే ఈ సినిమాకు ఎక్కువ రోజులే డేట్స్ కేటాయించడాన్ని తెలుస్తుంది.

Advertisement

ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

తాజా వార్తలు