టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన నివేదా థామస్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ హీరోయిన్ బాలనటిగా ఇండస్ట్రీలో సత్తా చాటడంతో హీరోయిన్ గా కూడా భారీస్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.
ఈ ఏడాది వకీల్ సాబ్ మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నివేదా థామస్ కు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి.నివేదా థామస్ తల్లి పేరు లిల్లీ కాగా నివేదా థామస్ తండ్రి పేరు థామస్.
థామస్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.నివేదాను ఆమె కుటుంబ సభ్యులు బేబీ అని పిలుస్తారు.
నివేదాకు ఒక బ్రదర్ ఉండగా ఆ బ్రదర్ పేరు నిఖిల్ కావడం గమనార్హం.బాల్యం నుంచి హీరోయిన్ కావాలని కలలు కన్న నివేదా థామస్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో మోడల్ గా రాణిస్తూ నటిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు.
నివేదా థామస్ బాల్యంలో మై డియర్ బూతం అనే సీరియల్ లో నటించడంతో పాటు మలయాళ మూవీ ఉత్తరలో నటించారు.
కొన్ని సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి నివేదా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా థామస్ జై లవకుశ సినిమాలో తారక్ కు జోడీగా నటించి మెప్పించారు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ అయినప్పటికీ నివేదా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా నివేదా థామస్ చదువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.మేకప్ తోనే క్లాసులకు హాజరైన రోజులు కూడా తన జీవితంలో ఉన్నాయని నివేదా థామస్ చెబుతున్నారు.ఆఫ్రికాలోని కిలిమంజోరా శిఖరాన్ని అధిరోహించి నివేదా థామస్ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy