సాధారణంగా హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని భావిస్తారు.సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ఆ సినిమాలో నటించడానికి హీరోహీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపరనే సంగతి తెలిసిందే.
అయితే సీనియర్ ఎన్టీఆర్ మాత్రం తన సినీ కెరీర్ లో ఒక సినిమాలో మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా నటించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే సీనియర్ ఎన్టీఆర్ శ్రీనాథుని కథతో సినిమా తీయాలని భావించారు.
బాపు రమణలకు తన మనసులో ఉన్న ఆలోచనను సీనియర్ ఎన్టీఆర్ చెప్పి ఆ సినిమాలో నటించాలని తనకు ఉందని వెల్లడించారు.అయితే బాపు రమణ మాత్రం సామాన్యులకు శ్రీనాథుని గురించి పెద్దగా అవగాహన లేదని వెల్లడించారు.
శ్రీనాథుని లైఫ్ లో పెద్ద కథ లేదని బాపు రమణ ఎన్టీఆర్ కు చెప్పుకొచ్చారు.
శ్రీనాథుని కథను సినిమాగా తీయడం తేలికైన కథ కాదని బాపు రమణ సీనియర్ ఎన్టీఆర్ కు వెల్లడించారు.

ఈ సినిమా ఆర్థికంగా నష్టాలను మిగులుస్తుందని వాళ్లు చెప్పారు.సీనియర్ ఎన్టీఆర్ మాత్రం నష్టం వచ్చినా ఇబ్బంది లేదని నిష్ఠతో సినిమా చేద్దామని కొంతమంది అయినా ఆ సినిమాను చూస్తే తనకు ఆ తృప్తి చాలని బాపు రమణలతో అన్నారు.శ్రీనాథ కవి సార్వభౌముడు పేరుతో బాపు డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కింది.

శ్రీనాథుని పాత్ర ధరించాలని తనకు కోరిక అని ఎన్టీఆర్ బాపు రమణలతో చెప్పి ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించారు.ఏదైనా అనుకుంటే నెరవేరే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు.కొత్త తరహా పాత్రలలో నటించాలనే ఆలోచన వస్తే మాత్రం సీనియర్ ఎన్టీఆర్ ఒడిదొడుకులు ఎదురైనా అస్సలు వెనక్కు తగ్గేవారు కాదు.
శ్రీనాథ కవి సార్వభౌముడు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని సమాచారం.