మొటిమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి

మొటిమలు .ఈ పేరుని ప్రపంచంలో ఇష్టపడే వ్యక్తులు అస్సలు ఉండరేమో.

టీనేజ్ లో మొదలయ్యి, యవ్వనం పూర్తిగా దాటేవరకు, కొంతమందిని దాటిన తరువాత కూడా ఇబ్బంది పెట్టే ఈ మొటిమల్ని మీరు అసహ్యించుకున్నా సరే, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.ఎందుకంటే నేర్చుకున్న విషయాలు మీకే ఉపయోగపడతాయి.

* అమెరికాలో దాదాపు 50 మిలియన్ల మంది మొటమలతో బాధపడుతున్నారట.* కేవలం టీనేజ్ లేదా యవ్వనంలోనే మొటిమలు వస్తాయి అనుకుంటే పొరపాటే.

అమెరికన్ అకాడెమి ఆఫ్ డెర్మటాలజి ప్రకారం 30-50 ఏళ్ళ వయసులో కూడా మొటిమలు రావొచ్చు.* ఆయిల్ స్కిన్ ఉంది కదా రోజంతా ముఖం కడిగేసుకుంటే మొటిమలు తగ్గుతాయనుకుంటున్నారా? ముఖాన్ని అతిగా కడిగితే అది మొటిమలకి సహాయమే చేయవచ్చు.రోజుకి రెండుసార్లు ముఖం కడుక్కుంటే చాలు.

Advertisement

* మొటిమలను కంట్రోల్ చేయడానికి అతిగా మందులు వాడితే మొటిమలు ఇంకా పెరగొచ్చు.* మొటిమల కోసం తయారుచేసిన కొన్నిరకాల మందులు (అన్ని కాదు) గర్భిణీ స్త్రీలు వాడితే, కడుపులో బిడ్డ అయితే చనిపోవచ్చు లేదా ఏదైనా లోపంతో పుట్టొచ్చు.

* సూర్యరశ్మి మొటిమల బాధను ఇంకా పెంచవచ్చు.మొటిమలతో బాధపడుతూ, రోజుకి 20 నిమిషాల కన్నా ఎక్కువ ఎండలో గడిపితే అంతే సంగతులు.

* ఆర్గానిక్, నేచురల్ ఫుడ్స్ అన్ని మొటిమలకి మంచివి కావు.కొన్నిరకాల సహజమైన ఆహారం కూడా మొటిమల బాధను పెంచవచ్చు.

* గర్భనిరోధక మాత్రలు కూడా మొటిమలకు కారణం కావచ్చు.

చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!
Advertisement

తాజా వార్తలు