తెలుగులో మల్లీశ్వరి సినిమాతో ఓవర్ నైట్ లో కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కత్రినా కైఫ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తెలుగులో తొలి సినిమాతోనే కత్రినా కైఫ్ కు సక్సెస్ దక్కింది.ఆ తర్వాత కత్రినా కైఫ్ అల్లరి పిడుగు సినిమాలో నటించగా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.
ఆ తర్వాత కత్రినా కైఫ్ బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు.
వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా అదేస్థాయిలో పాపులారిటీని తెచ్చుకున్నారు.
ఇప్పటివరకు సినిమాల ద్వారా వార్తల్లో నిలిచిన కత్రినా కైఫ్ ప్రస్తుతం పెళ్లి ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ ప్రేమించుకుని వివాహం చేసుకుంటున్నారు.
అయితే వీళ్లిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోవడం గమనార్హం.
రాజస్థాన్ రాష్ట్రంలోని అన్యదేశకోటలో వీళ్లిద్దరి మ్యారేజ్ జరగనుంది.

అయితే కాఫీ విత్ కరణ్ షో ద్వారా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని సమాచారం.మొదట మంచి స్నేహితులుగా ఉన్న కత్రినా విక్కీ కౌశల్ బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కలిసే వస్తుండేవారు.ఫిల్మ్ కంపానియన్స్ టెప్ కాస్ట్ ఎపిసోడ్ కొరకు మొదటిసారి వీళ్లిద్దరూ కలిసి వచ్చారని సమాచారం.షేర్షా మూవీ స్క్రీనింగ్ సమయంలో కూడా వీళ్లిద్దరూ కలిసి కనిపించారు.

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ల వివాహ వేడుకకు 120 మంది హాజరు కానున్నారని తెలుస్తోంది.వీరి వివాహ వేడుకలో అతిథులకు సెల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.