చంద్రముఖి సినిమాను రిజెక్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడెవరంటే?

తెలుగు, తమిళ భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో చంద్రముఖి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.పి.

 Interesting Facts About Chandramukhi Movie Details, Chandramukhi, Chiranjeevi, V-TeluguStop.com

వాసు డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా 19 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.మలయాళంలో వచ్చిన మణిచిత్రతాయు సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

అయితే ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా మెగాస్టార్ చిరంజీవి వదులుకున్నారని బోగట్టా.

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన వీఎన్ ఆదిత్య మణిచిత్రతాయు సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలని ఇచ్చి ఆ సినిమా సీడీని చిరంజీవికి ఇచ్చారు.

అయితే చిరంజీవికి ఆ సినిమా ఎందుకో కనెక్ట్ కాలేదు.ఆ కారణం వల్లే వీఎన్ ఆదిత్య ఎంత చెప్పినా ఆయన వినలేదు.

ఆ తర్వాత పి.వాసు చంద్రముఖిని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం జరిగింది.

Telugu Bhola Shanka, Chandramukhi, Chiranjeevi, Vasu, Rajnikanth, Vn Aditya-Movi

చంద్రముఖి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత చిరంజీవి వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి చంద్రముఖి సినిమా విషయంలో నీ అంచనా నిజమైందని ఆ సినిమాలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం.ఒకవేళ చంద్రముఖి సినిమాలో చిరంజీవి నటించి ఉంటే ఆ సినిమా కూడా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉండేదని చెప్పవచ్చు.

Telugu Bhola Shanka, Chandramukhi, Chiranjeevi, Vasu, Rajnikanth, Vn Aditya-Movi

మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో చంద్రముఖి కథ రిస్క్ అని చిరంజీవి భావించి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.చిరంజీవి తన సినీ కెరీర్ లో కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా నటించలేదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube