ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు.సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు కృష్ణంరాజు 1940 సంవత్సరం జనవరి నెల 20వ తేదీన మొగల్తూరులో జన్మించారు.
కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు కాగా ఆయన తన సినీ కెరీర్ లో 187కు పైగా సినిమాలలో నటించారు.కృష్ణంరాజు నటించిన తొలి సినిమా చిలకా గోరింక కాగా రాధేశ్యామ్ మూవీ ఆయన నటించిన చివరి సినిమా కావడం గమనార్హం.
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు కాగా వాజ్ పేయి హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు.మాస్ యాక్షన్ సినిమాలలో నటించడం ద్వారా కృష్ణంరాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ఎలాంటి ఎక్స్ ప్రెషన్ అయినా కళ్లతోనే అద్భుతంగా పలికించే కృష్ణంరాజుకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.పలు సినిమాలలో కృష్ణంరాజు విలన్ రోల్స్ లో చేసి ఆ రోల్స్ లో తన నటనతో మెప్పించారు.
తెలుగులో ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్న నటుడు కృష్ణంరాజు కావడం గమనార్హం.అమరదీపం అనే సినిమాకు కృష్ణంరాజుకు నంది అవార్డ్ దక్కింది.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కృష్ణంరాజు సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.
అయితే కృష్ణంరాజు ఒక కోరిక తీరకుండానే చనిపోయారు.

ప్రభాస్ పెళ్లి చూడాలని ప్రభాస్ పిల్లలతో కూడా కలిసి నటించాలని కృష్ణంరాజుకు కోరిక ఉండేది.అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు.కృష్ణంరాజు మరణవార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా, మంచి మనిషిగా కృష్ణంరాజు గుర్తింపును సొంతం చేసుకున్నారు.







