ఆర్ఆర్ఆర్ కు ముందు ఆచార్య విడుదలైతే అలా జరిగేదా.. చరణ్ కు నష్టమంటూ?

చిరంజీవి, చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆచార్య ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.

ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు కానీ ఆచార్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిలైంది.

చిరంజీవిపై ఎంతో అభిమానం ఉన్న మెగా ఫ్యాన్స్ కు, కొరటాల శివ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఆచార్య కథ నచ్చలేదు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది.

అయితే ఆర్ఆర్ఆర్ కు ముందు ఆచార్య విడుదలైతే మాత్రం ఆచార్య బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా రిజల్ట్ కొంతమేర మెరుగ్గా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య సినిమాను వాయిదా వేసి మేకర్స్ తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండకు, ఆచార్యకు కొన్ని పోలికలు ఉన్నాయని అఖండకు ముందు ఈ సినిమా విడుదలై ఉన్నా బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నుంచి ఆశించే సినిమా అయితే కాదని మరి కొందరు చెబుతున్నారు.

Advertisement

కొరటాల శివ కెరీర్ లో ఆచార్య సినిమా మచ్చగా మిగిలిపోతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఆచార్య ఫ్లాప్ కు సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తుండగా కొరటాల శివ స్పందనను బట్టి ఈ సినిమా ఫలితం విషయంలో ఆయన అభిప్రాయం తేలే ఛాన్స్ ఉంది.

కొరటాల శివ గత సినిమాలు కూడా ఒకటి రెండు ఏరియాలలో ఫ్లాప్ అయినా ఈ సినిమా మాత్రం అన్ని ఏరియాలలో ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో టికెట్లు ఈవెనినింగ్ షో, సెకండ్ షోలకు అందుబాటులో ఉన్నాయి.ఆచార్య తొలిరోజు కలెక్షన్లు కూడా భారీగా ఉండే అవకాశం అయితే లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు