సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ కు ఈ మధ్య అసలు టైం బాగుండట్లేదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల డ్రామాలో ఇప్పటికే ఇరుక్కున్న సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్.
వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన కథనంతో మన దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ రాజకీయ రచ్చలో ఇరుక్కునాయి.ఇక తాజాగా భారత మెన్స్ క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భార్యకు ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ కోపం తెప్పించింది.
మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
హార్దిక్ పాండ్యా, అతడి భార్య నటాషా ఇవనోవిచ్‌లు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.
ఇక తాజాగా హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను హగ్ చేసుకొని బుగ్గ మీద కిస్ చేస్తున్న ఫోటోను నటాషా తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశారు.ఆ ఫోటో తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఇన్‌స్టాగ్రాం ఆ ఫోటోను రిమూవ్ చేశారు.ఇన్‌స్టాగ్రాం చేసిన పనికి షాక్ అయిన నటాషా ‘సీరియస్‌లీ.!’ అంటూ ఇన్‌స్టాగ్రాంను టాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.మరి ఇన్‌స్టాగ్రాం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇది చూస్తున్న విశ్లేషకులు పాపం ఏది ఉంచాలో ఏది తీయాలో తెలియని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ పరిస్థితిని చూసి బాధపడుతున్నారు.