నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యింది.
ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది.కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.
ఇక ఇందులో హీరోయిన్స్ కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయారు.ఇక ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ పుట్టినరోజు నాడు డైలాగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమా టైటిల్ కూడా త్వరలో ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.ఇందులో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.
యాక్షన్ నేపధ్యంలోనే సినిమా ఉండబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తనకి కెరియర్ లో ఎక్కువ సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు బి గోపాల్ తో సినిమా సెట్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా కూడా వారి కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాల మాదిరిగానే పవర్ ఫుల్ కథతో సిద్ధం అవుతుంది.ఇక బాలకృష్ణతో సమరసింహా రెడ్డి లాంటి ట్రెండ్ సెట్ సినిమా చేసిన దర్శకుడు బి గోపాల్ తో సినిమా అంటే కచ్చితంగా అభిమానులకి భారీ అంచనాలు ఉంటాయి.
ఈ నేపధ్యంలో దర్శకుడు స్క్రిప్ట్ బాధ్యతలని ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా ఉన్న సాయి మాధవ్ బుర్రా చేతిలో పెట్టారు.ఇక సాయి మాధవ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
త్వరలో రచయిత, దర్శకుడు వెళ్లి బాలకృష్ణకి కథని నేరేట్ చేయబోతున్నారు.ఇక ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు ఉంటుందని తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని టాక్.