ఇన్‌స్టాగ్రాం డౌన్‌.. నెటిజెన్ల మీమ్‌ ఫెస్ట్‌!

ఉదయం నుంచి ఇన్‌స్టాగ్రాం క్రాష్‌ అవుతోంది.దీంతో ఈ సోషల్‌ మీడియా యాప్‌ వినియోగదారులు ఇన్‌స్టాను స్క్రోల్‌ చే స్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు.

 Instagram Down  Netizens Spark Meme Fest , Crashing, Facebook App, Instagram, Ne-TeluguStop.com

ఇన్‌స్టాగ్రాం యూజర్లు ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో తమ గోడును వెల్లబుచ్చుకున్నారు.యాప్‌ను ఉపయోగించలేని పరిస్థితి ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

కొన్ని మిలియన్ల మంది వినియోగదారులున్న ఈ సోషల్‌ మీడియా దిగ్గజం ప్రతి 2–3 నిమిషాలకు క్రాష్‌ అవుతూ ఉంది.పైగా టైమ్‌లైన్‌లో కూడా ఎటువంటి పోస్టింగ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

చివరకు స్నేహితులకు, ఇతరులకు డైరెక్ట్‌ మెసేజ్‌లు పంపించాలన్నా ఇబ్బందులు ఎదురైనాయని సోషల్‌ మీడియా వేదికగా యూజర్లు ఫిర్యాదు చేశారు.అయితే, కంపెనీ మాత్రం ఈ సమస్యకు కారణం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేదు.

కానీ, యూజర్లు యాప్‌ వినియోగించేటపుడు ‘ మమ్మల్ని క్షమించండి’ అనే మెసేజ్‌ మాత్రం వస్తోంది.ఎదో తప్పు జరిగింది.

దయచేసి మళ్లీ ప్రయత్నించండి.ఇన్‌స్టాగ్రాంపై డబ్బు సంపాదించేవారు కూడా ఉన్నారు.

ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతే.వారి కంటెంట్, ఆదాయంపై ప్రభావం పడుతుంది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం యాప్‌ ఎందుకు డౌన్‌ అయిందో తెలియదు కానీ, డౌన్‌టెక్టర్, డౌన్‌టైం ట్రాకింగ్‌ ప్రకారం ఈరోజు ఉదయం నుంచి చాలా మంది ఇన్‌స్టాగ్రాం వినియోగదారులు సైట్‌ను వినియోగదారులు ఉపయోగించలేకపోయారు.ఇన్‌స్టాగ్రాం కథనాలు, రీల్స్‌ ఇతరాలను అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.47 శాతం వినియోగదారులు పూర్తి స్థాయిలో యాప్‌ను వినియోగించలేకపోయారు.27 శాతం మంది యాప్‌ వెబ్‌ వెర్షన్‌ని ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.మిగతా 26 శాతం మంది తమ సర్వర్‌ కనెక్టవ్వడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు.డౌన్‌డిక్టెటర్‌ వివరాల ప్రకారం భారత ప్రామాణిక సమయం ఉదయం 10:35 నుంచి సైట్‌ క్రాషింగ్‌ మొదలైంది.ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు.ఇన్‌స్టాగ్రాం ఈ విధంగా క్రాష్‌ అవ్వడంతో విసుగెత్తిన నెటిజెన్లు మీమ్‌ ఫేస్ట్‌ను ప్రారంభించారు.

ఇప్పటి వరకు లేని ఫన్నీ మీమ్‌లను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ఇన్‌స్టాగ్రాం యాప్‌ ఇలా క్రాష్‌ అవ్వడం ఇదేం మొదటిసారి కాదు.

గతంలో కూడా అనేకసార్లు సమస్యలను వచ్చినా.వాటిని ఫిక్స్‌ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube