టక్ జగదీష్ థియేటర్లో పడుంటే ఏమయ్యేది?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నించినా, కరోనా కరాణంగా అది కుదర్లేదు.

దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక ఈ ప్రకటనతో నానిపై పలు రకాల కామెంట్స్ చేస్తూ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లో సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని భావించి, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇదే అంశంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువరు డిస్ట్రిబ్యూటర్లు నాని సినిమాలకు సంబంధించి వివాదాస్పద కామెంట్లు చేశారు.

అయితే తాజాగా ‘టక్ జగదీష్’ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నాని ఈ అంశంపై స్పందించారు.ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్ణయం చిత్ర నిర్మాతలదే అని ఆయన అన్నాడు.

Advertisement

ఒకవేళ కరోనా సమయంలో సినిమాను థియేటర్లో రిలీజ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.కాగా టక్ జగదీష్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

దీంతో ఈ సినిమాను నేరుగా థియేటర్లో రిలీజ్ చేసుంటే బాగుండేది అని ఫ్యామిలీ ఆడియెన్స్ అంటున్నారు.కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని మరోసారి చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాలో నానితో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తుండగా, అందాల భామలు రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు