మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సోదాలలో సుమారు 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.దీనిలో భాగంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగవేసినట్లు ఆరోపిస్తూ సుశీ ఇన్ ఫ్రాపై జీఎస్టీ ఆఫీసర్లు సోదాలు నిర్వహిస్తున్నారు.సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.







