ఈ మధ్యకాలంలో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సినిమాలు ఊహించిన విధంగా కలెక్షన్లను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశను ఎదుర్కొంటున్నాయి.అయితే ఇలాంటి సమయంలో సమంత నటించిన యశోద సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల అయ్యి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది.ఇకపోతే తాజాగా యశోద సినిమా ద్వారా సమంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
యశోద సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఏకకాలంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబట్టి అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిందని తెలుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో యశోద సినిమా ఒకటి.
ఇలా సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్లను సంపాదించుకున్న సినిమాలలో సమంత సినిమా ఎనిమిదవ స్థానంలో నిలబడటం విశేషం.
![Telugu Place, Owns Rare, Samantha-Movie Telugu Place, Owns Rare, Samantha-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/11/Sam-owns-a-rare-record-Samantha.jpg )
ఈ సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల అనుకున్న దాని కన్నా భారీ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది.మొదటి రోజే ఈ సినిమా మూడు కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది.ఇలా యశోద సినిమా కూడా హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలలో ఇది ఒకటి అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించారు.ఈ సినిమాకి ఈమె నటన కూడా ఎంతో ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.
ఇక మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ముందు ముందు ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.