సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద.హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతుంది.ఇలా సమంత యశోద సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే సినిమా షూటింగ్ సమయంలో సమంత దర్శక నిర్మాతలకు పలు కండిషన్లు పెట్టిందని ఆ కండిషన్లకు ఒప్పుకుంటేనే తాను సినిమా షూటింగ్లో పాల్గొంటానని తెలియజేశారట.
సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని వారాలకి యశోద సినిమా కథ విని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా కథ సమంతకు నచ్చడంతో చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట అయితే ఈ సినిమాలో తాను నటించాలంటే కొన్ని కండిషన్లను ఒప్పుకోవాలని ఆ కండిషన్లకు నిర్మాతలు ఓకే అంటేనే తన సినిమాలో నటిస్తానని తెలిపారట.విడాకుల తర్వాత సమంత ఈ సినిమా షూటింగ్లో పాల్గొనే సమయంలో ఎవరూ కూడా తనని ఇబ్బంది పెట్టకూడదని తెలిపారట.

షూటింగ్ సమయంలో తనని పూర్తిగా ఫ్రీగా వదిలేయాలని అలాగే తన విడాకుల గురించి ఎక్కడ ప్రశ్నలు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలదేనని కండిషన్ పెట్టారట ఇలా ఈ కండిషన్లకు ఒప్పుకుంటే తాను ఈ సినిమాలో నటిస్తానని సమంత వెల్లడించారు.ఇకపోతే నిర్మాతలు కూడా సమంత చెప్పిన కండిషన్ కి ఒప్పుకోవడమే కాకుండా తనకి ఇలాంటి ఇబ్బందులు ఎదుర కాకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని నియమించారని తన షాట్ పూర్తి కాగానే సెక్యూరిటీ సమక్షంలో తను క్యారవాన్ లోకి వెళ్లేదని అనంతరం షాట్ రెడీ అయిన తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చేదని తెలుస్తోంది.ఇలా యశోద సినిమా సమయంలో సమంత పెట్టిన ఈ కండిషన్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.







