Samantha Ruth Prabhu Yashoda : యశోద ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ యశోద. హరి – హరీష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

 Samantha Ruth Prabhu Yashoda First Weekend Box Office Collections , Yashoda Firs-TeluguStop.com

ఎప్పటి నుండి సామ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ చేసారు.కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవ్వడమే కాకుండా పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది.

శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ ఖుషీగా ఉన్నారు.

అయితే సమంత మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూ ఉండడంతో చివరి నిముషంలో ఇంటర్వ్యూలలో పాల్గొంది.దీంతో ముందు నుండి ప్రొమోషన్స్ హడావిడి కనిపించలేదు.అయినా చివరి నిముషంలో ఈమె ప్రొమోషన్స్ చేసి బజ్ వచ్చేలా చేసింది.ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

Telugu Hari Harish, Samantha, Samantharuth, Yashoda, Yashoda Weekend-Movie

ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అవ్వగా మంచి వసూళ్లను అందుకుంటుంది.ఇక తాజాగా ఈ వీకెండ్ పూర్తి అవ్వడంతో తాజాగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ దడపా 20 కోట్ల రూపాయలు వసూలు చేసిందట.ఈ వీక్ లో మరో సినిమా లేకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమా స్లో అయ్యే అవకాశాలు కూడా లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

చూడాలి మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube