లిక్కర్ స్కాం ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్ కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా కోర్టు ఎదుట హజరుపరచనున్నారు.ఈ క్రమంలో కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదేవిధంగా ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై( Kavitha Bail Petition ) కూడా ఇవాళ విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది.

మరోవైపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.బెయిల్ ఇస్తే కవిత కేసును ప్రభావితం చేయగలరని సీబీఐ పేర్కొంది.

Advertisement

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు