అమరావతిలో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై విచారణ

అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు జోనల్ రెగ్యులేషన్స్ మార్పుపై న్యాయస్థానంలో రైతులు సవాల్ చేశారు.

ఈ క్రమంలో రైతుల పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.అయితే రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్దేశించిన చట్ట సవరణలకు ఇటీవల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.

దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు