దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఈనెల 18వ తేదీ పుట్టిన రోజును జరుపుకుంటుంది.ఇలా ఈమె 18వ తేదీ పుట్టినరోజు జరుపుకోవడంతో తన భర్త విగ్నేష్ శివ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.
విగ్నేష్ శివన్ చాలా సర్ప్రైజ్ గా నయనతారకు ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని భావించారట.నవంబర్ 18వ తేదీ నయనతార జరుపుకొనే ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం కావడంతో విగ్నేష్ సైతం ఈ పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
గత ఏడు సంవత్సరాల నుంచి నయనతార పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన విగ్నేష్ ఈ ఏడాది మాత్రం జీవితంలో నయనతారకు ఈ పుట్టినరోజు వేడుక గుర్తుండిపోయేలా జరపాలని భావిస్తున్నారట.నయనతార నవంబర్ 18వ తేదీ జరుపుకునే పుట్టినరోజు తనకు పెళ్లి అయిన తర్వాత మొదటి పుట్టిన రోజు కావడం విశేషం.
అలాగే తన పిల్లలకు తల్లి అయిన తర్వాత ఈమె మొదటి పుట్టినరోజున జరుపుకోవడంతో ఈ వేడుక ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారట.

ఇకపోతే నయనతార పుట్టినరోజు వేడుకలో భాగంగా తన ఇద్దరు కుమారులు స్పెషల్ గెస్ట్లుగా స్పెషల్ అట్రాక్షన్ గా సందడి చేయనున్నట్టు తెలుస్తుంది.ఇకపోతే కొద్ది రోజుల క్రితం నయనతార సైతం విగ్నేష్ శివ పుట్టినరోజు వేడుకలను దుబాయిలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపిన విషయం తెలిసిందే.పెళ్లయిన తర్వాత మొదటిసారి విగ్నేష్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నయనతార తన బర్త్ డే ని కూడా విగ్నేష్ అలాగే నిర్వహించాలని భావించారట.
ప్రస్తుతం నయనతార పుట్టినరోజుకు సంబంధించిన ఈ వార్త వైరల్ అవుతుంది.







