టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు.రాబోయే విపత్తులను ముందుగానే అంచనా వేసి దానికనుగుణంగా రాజకీయం చేసి సక్సెస్ అవ్వడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు.
గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అనే ప్రచారం తో పాటు, ఇంటిలిజెన్స్, సర్వే సంస్థలు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంది అని చెప్పినా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.బలమైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినా.
ఇక్కడ టిఆర్ఎస్ విజయం సాధించడం వెనక ఆ పార్టీ అధినేత కేసిఆర్ రాజకీయ వ్యూహం ఉంది. ఎన్నికల సమయంలో ఎదురు కాబోయే క్లిష్ట పరిస్థితులను ముందుగానే ఊహించిన కేసీఆర్ దానికి అనుగుణంగా వామ పక్ష పార్టీలతో ఎన్నికలకు ముందు పొత్తు ప్రయత్నాలు చేశారు.
బిజెపిని అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్న వామపక్ష పార్టీలు టిఆర్ఎస్ కోరిన వెంటనే ఆ పార్టీకి తమ మద్దతు తెలియజేశాయి.అనుకున్నట్లే మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.
దానికి కృతజ్ఞతలు తెలిపేందుకు టిఆర్ఎస్ తరఫున మునుగోడు ఉప ఎన్నికల ఇన్చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు.

సిపిఎం కార్యాలయానికి వెళ్లి జగదీశ్వర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.తమకు మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రచారంలో బాగా పనిచేశాయని జగదీశ్వర్ రెడ్డి మెచ్చుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా … అసలు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి క్రెడిట్ మొత్తం వామపక్ష పార్టీలకు కేసీఆర్ ఇవ్వడం వెనక చాలా వ్యూహమే ఉన్నట్టుగా అర్థమవుతుంది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీల పొత్తు లేకపోతే టిఆర్ఎస్ విజయం దక్కి ఉండేది కాదు.కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉండడం ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు కమ్యూనిస్టు కార్యకర్తలంతా నడుచుకోవడం, ఆ పార్టీ సూచించిన వారికి ఓటు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి.
అందుకే పెద్దగా బలం లేకపోయినా వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పార్టీ మద్దతుదారుల పూర్తి ఓటు బ్యాంకు తమకు ఉంటుంది అనే భావంతో అని రాజకీయ పార్టీలు వారితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేశారు.
రాబోయే సార్వత్రికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఇదంతా చేసినా.రాబోయే ఎన్నికల్లోను ఆ పార్టీల మద్దతుతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు .ఈ మేరకు ఆ రెండు పార్టీలకు కొన్ని సీట్లను కేటాయించేందుకు కెసిఆర్ సిద్ధంగానే ఉన్నారు.ఈ ప్రభావం రాష్ట్రస్థాయిలో తమకు అనుకూలంగా మారుతోందని తమకు అదనపు భాగం చేకూరుతుందని తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అంచనా వేస్తోంది.







